News

ఫార్టి మారను:టి.రాజయ్య


పార్టీ మారతానని వస్తున్న వార్తలను తెలంగాణ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య ఖండించారు. తాను పార్టీ మారవలసిన అవసరం లేదని, తాను టిఆర్ఎస్ లోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. రాజయ్య కాంగ్రెస్ లో చేరి వరంగల్ నుంచి ఎంపిగా   పోటీచేస్తారని మీడియాలో వస్తున్న కధనాలు ఊహాజనితమేనని ఆయన స్పష్టం చేశారు.ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ సాధనలో తాను కూడా పాల్గొంటానని ఆయన అన్నారు. మున్సిపల్ సమ్మె సందర్భంగా రాజయ్య చేసిన వ్యాఖ్యలు కొంత వివాదానికి, ఊహాగానాలకు తావిచ్చాయి.